టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) మళ్ళీ తన మార్క్ చూపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ (AK-47: హౌస్ నెం.47) (Adarsha Kutumbam) (AK-47: House No.47) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటూ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
సాధారణంగా ఫ్యామిలీ సినిమాలకు కలెక్షన్లు (Collections) నిలకడగా వస్తుంటాయి. కానీ వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ మాత్రం మాస్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమా అఫీషియల్‌గా ‘బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’గా (Blockbuster Family Entertainer నిలిచింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Haarika & Hassine Creations) బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (S. Radha Krishna) (చినబాబు) భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ పక్కన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), నివేదా థామస్(Nivetha Thomas), రోహిత్ నారా (Rohith Nara) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. థమన్ (S. Thaman) అందించిన సంగీతం సినిమా భారీ విజయానికి మరింత ఊపునిచ్చింది. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్, ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ వర్క్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఈ సంచలన విజయానికి ఆనందం వ్యక్తం చేస్తూ, చిత్ర బృందం అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో వెంకటేష్ తనదైన స్టైల్లో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.







