ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మతపరమైన వివాదం.. షరియా ప్రకారం చెల్లదన్న మౌలానా!

ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మతపరమైన వివాదం.. షరియా ప్రకారం చెల్లదన్న మౌలానా!

Summarize with AI

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir Chief Minister) ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah), ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్ (Nidhi Razdan) వివాహంపై (Marriage) మతపరమైన వివాదం తెరపైకి వచ్చింది. వీరిద్దరి వివాహం ఇస్లామిక్ షరియా నిబంధనల ప్రకారం (Islamic Sharia Rules) చెల్లుబాటు కాదంటూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ(Maulana Mufti Shahabuddin Razvi Barelvi) వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం నికాహ్ చెల్లుబాటు కావాలంటే వధూవరులిద్దరూ ముస్లింలై (Muslim) ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం అయినప్పటికీ, నిధి రజ్దాన్ ముస్లిం కాకపోవడంతో ఈ వివాహాన్ని షరియా (Sharia) ప్రకారం అనుమతించలేమని అభిప్రాయపడ్డారు.

నిధి రజ్దాన్ వివాహానికి ముందే ఇస్లాంలోకి (Islam) మారి ఉంటే, అనంతరం ఇస్లామిక్ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం నికాహ్ (Nikah) చేసుకున్నట్లయితే ఆ వివాహాన్ని షరియత్ నిబంధనల ప్రకారం ఆమోదించవచ్చని మౌలానా వ్యాఖ్యానించారు. ఇస్లాంలో వివాహానికి సంబంధించి నిర్దిష్టమైన నియమాలు, షరతులు ఉన్నాయని, వాటిని పాటించడం తప్పనిసరి అని వివరించారు. దంపతుల్లో ఒకరు ముస్లిం కాకపోతే అలాంటి వివాహాన్ని ఇస్లామిక్ చట్టాల ప్రకారం చెల్లుబాటైనదిగా పరిగణించలేమని పేర్కొంటూ, ఒమర్ అబ్దుల్లా, నిధి రజ్దాన్ వివాహంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment