ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 39 సార్లు ఢిల్లీకి వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప, ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తేలేకపోయారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తీరు గల్లీలో హోదాను మరిచి తిట్లు, ఢిల్లీలో చిట్ చాట్లు అన్నట్లుగా ఉందని, ఆయన కాలు గడప దాటకపోయినా ఢిల్లీలో మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
సాగునీళ్లపై శ్రద్ధ లేదు, ఢిల్లీ టూర్లు
రాష్ట్రంలో నీటి ఎద్దడి, ఎండి పోతున్న పంటలు, బాధపడుతున్న రైతులను వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీలోచక్కర్లు కొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీతో సంబంధాల గురించి తెలంగాణ ప్రజలకు ఏమి అవసరం? ఈ సంబంధాల వల్ల రాష్ట్రానికి ఏమి లాభం? అని ప్రశ్నించారు. గ్రామ గ్రామాల ప్రజలు తమను మోసం చేశారని వాపోతుంటే, ముఖ్యమంత్రి మాత్రం ఈ ఫిర్యాదులను పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.
గాలి మాటలు, గబ్బు కూతలే!
హామీల అమలు చేతగాక, కేవలం మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. “జాగో తెలంగాణ జాగో” అంటూ తన ట్వీట్‌ను ముగించారు.
గల్లీలో హోదాను మరిచి తిట్లు – ఢిల్లీలో చిట్ చాట్లు.
— KTR (@KTRBRS) March 14, 2025
కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి.
నీళ్లు లేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్.
39 సార్లు ఢిల్లీ పోయి మీడియా…








