దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

శ్రీచైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాల్లో అధికారులు ఈ దాడులను చేపట్టారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం.

అక్రమ లావాదేవీలు ఎలా జరిగినాయంటే?

విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకుని, ఆ డబ్బును ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఉపయోగించినట్లు సమాచారం. అంతేకాకుండా, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, దాని ద్వారా లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని మాదాపూర్‌లో ఉన్న శ్రీచైతన్య కాలేజీ ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment