ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

Summarize with AI

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు కఠిన శిక్షలు విధించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులలో ప్రధానమైన సుభాష్ శర్మకు ఉరిశిక్షను ప్రకటించగా, మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది.

ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో ఓ ఆస్పత్రి నుంచి అమృతతో కలిసి వెళ్తున్న ప్రణయ్‌పై సుభాష్ శర్మ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన కుల వివక్షపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కాగా, ఈ కేసులో నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేస్తూ ఈరోజు తీర్పు విడుదల చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment