AP సీఎం ఎవ‌రో చెప్తే రూ. ల‌క్ష బ‌హుమ‌తి

సీఎం ఎవ‌రో చెప్తే రూ. ల‌క్ష బ‌హుమ‌తి

Summarize with AI

రాష్ట్ర ప్రజలకు జనజాగారణ సమితి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎవరో? సరైన జవాబు చెప్పిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది. జ‌న జాగ‌ర‌ణ స‌మితి ప్ర‌క‌ట‌న‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మార్చి 10వ తేదీ లోపు సరైన జవాబులను 7288904076 ఫోన్ నెంబర్ కు వాట్సప్ మెసేజ్ చేయాలని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్‌ వాసు కోరారు.

ఈ మధ్య చంద్రబాబు నాయుడు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్లుగా వైసీపీకి ఓట్లు వేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో మేధావులు, విద్యావంతులకు జన జాగరణ సమితి ఈ వినూత్న పోటీని నిర్వహిస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలకు ఓట్లు వేసిన కోట్లాదిమంది ఓటర్లు గత మూడు రోజుల నుండి ఏపీకి ముఖ్యమంత్రి ఎవరా? అని తీవ్ర గందరగోళంలో ఉన్నారు. కాబట్టి మేధావులు, విద్యావంతులు ఈ పోటీలో పాల్గొని సరైన జవాబు చెప్పి స్పష్టత ఇవ్వాల్సిందిగా జన జాగరణ సమితి పిలుపునిచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment