‘పుష్ప’ సినిమాతో గుర్తింపు పొందిన ధనంజయ (జాలి రెడ్డి), ఇటీవల తన ప్రేయసి డాక్టర్ ధన్యతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరి వివాహ వేడుకలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
వివాహ సమయంలో ధనంజయ మూడు ముళ్లు వేసిన తర్వాత, పురోహితుడు ధన్యతను ఆశీర్వాదం తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో ఆమె కాళ్లు మొక్కేందుకు ముందుకు రాగా, ధనంజయ వినయంగా నిరాకరించాడు. కానీ పెద్దల ఒత్తిడితో ధన్యత ధనంజయ కాళ్లు మొక్కగా, ధనంజయ వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు.
ఈ సంఘటనను చూసిన నెటిజన్లు ధనంజయ వినయాన్ని మెచ్చుకుంటున్నారు. కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇది నిజమైన గౌరవం! అలాంటి మనసున్నవాళ్లు అరుదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ధనంజయ చేసిన పని పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.








