ప‌వ‌న్‌ను చూసుకొనే రెచ్చిపోతున్నాడు.. సంచ‌ల‌న ఆధారాలు రిలీజ్ చేసిన ల‌క్ష్మీ

ప‌వ‌న్‌ను చూసుకొనే రెచ్చిపోతున్నాడు.. సంచ‌ల‌న ఆధారాలు రిలీజ్ చేసిన ల‌క్ష్మీ

జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ స‌పోర్టుతోనే తిరుప‌తిలో కిర‌ణ్ రాయ‌ల్ రెచ్చిపోతున్నాడ‌ని, అమ్మాయిల‌ను, అమాయ‌క జ‌నాల‌ను మోసం చేయ‌డం త‌ప్ప కిర‌ణ్ రాయ‌ల్ ఎలాంటి వ్యాపారం చేయ‌డ‌ని బాధితురాలు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిలను మోసం చేసి వారి డబ్బుతో విలాసవంత‌మైన‌ జీవితం గడిపే నీచుడు వ్యక్తి కిరణ్‌ రాయల్‌ అని ఆమె ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్ల‌బ్‌లో మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మి.. జ‌న‌సేన నేత‌ కిరణ్‌ రాయల్‌కు, త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన లావాదేవీలు, ఫొటోలు, ఫోన్ కాల్ ఆడియోల‌ను ఆమె రిలీజ్ చేశారు. బాధితురాలు ల‌క్ష్మీ రిలీజ్ చేసిన ఎవిడెన్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మీ Proofs Google Link : https://drive.google.com/drive/folders/1kvOfJa8LQsn37Vq-m7CTkQM4JJwL39ar?usp=sharing

అమ్మాయిల‌ను మోసం చేసి డ‌బ్బులు లాక్కోవ‌డ‌మే అత‌ను చేసే బిజినెస్ అని, ఆడవారిని నిమ్మించి మోసం చేసిన లాక్కున్న సొమ్ముతో రాజకీయ నాయకుడి అవ‌తారం ఎత్తాడ‌న్నారు. జ‌న‌సేన నేత కిరణ్‌ రాయల్‌ బాధితులు అనేకం ఉన్నార‌ని, త‌న మాట‌కు ఎదురుచెప్తే ఆడ‌వారిని కూడా చూడ‌కుండా దుర్మార్గంగా కొంద‌రిని కొట్టాడని బాధితురాలు ల‌క్ష్మీ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అందుకు కిర‌ణ్ రాయ‌ల్ భార్య రేణుక, కూతురే సాక్ష్యమ‌ని, త్వరలో త‌న‌లా మరింత మంది బాధితులు బయటకు వస్తారని చెప్పారు.

కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మీ Proofs Google Link2 : https://drive.google.com/drive/folders/1H7XJqq0fOGiPvpl0lSo3lvVQ7aL1ZPUl?usp=sharing

తాను మోస‌పోయాన‌ని, ఆధారాలు చూపిస్తూ న్యాయం చేయ‌మ‌ని వేడుకున్నందుకు త‌న‌కు పార్టీల‌తో సంబంధాలు అంట‌గ‌డుతున్నాడ‌ని, తాను ఏ పార్టీకి చెందిన వ్య‌క్తిని కాద‌ని బాధితురాలు ల‌క్ష్మీ చెప్పారు. కిర‌ణ్ రాయ‌ల్ బాగోతాల‌న్నీ బ‌య‌ట‌పెడుతున్నందుకు త‌న‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేయిస్తున్నాడ‌ని, అత‌ని అరాచ‌కాల‌పై అన్ని ఆధారాల‌ను విడుద‌ల చేశాన‌ని చెప్పారు. భూమన కుటుంబంతో త‌న‌కేం సంబంధం లేద‌ని కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మీ వివ‌రించారు. ప‌నిగ‌ట్టుకొని కిరణ్‌ రాయల్‌ నీచ ప్రచారం చేయిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

జ‌న‌సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స‌పోర్టు త‌న‌కు ఫుల్‌గా ఉంద‌ని, త‌న‌తో త‌ర‌చూ చెప్పేవాడ‌ని, ప‌వ‌న్ మ‌ద్ద‌తుతోనే కిర‌ణ్ రాయ‌ల్ తిరుప‌తిలో అరాచ‌కాలు సృష్టిస్తూ, అమ్మాయిల‌ జీవితాలతో ఆడుకుంటున్నాడ‌న్నారు. దీనిపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాల‌న్నారు. తన డబ్బు తనకు వచ్చే వ‌ర‌కు పోరాటం ఆగదని, కిర‌ణ్ రాయ‌ల్ వెనకాల ఉన్నవారిపై దర్యాప్తు చేయాలని, అమ్మాయిల‌ను వేధించే ప‌ర‌మ‌నీచుడైన కిర‌ణ్‌ను ఎవరూ నమ్మొద్దని బాధితురాలు ల‌క్ష్మీ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment