IND vs ENG: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ

IND vs ENG: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ

Summarize with AI

స్వ‌దేశంలో ఇంగ్లాండ్ జ‌ట్టుతో జ‌రుగుతున్న చివ‌రి వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివ‌రి మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో భార‌త్ కైవ‌సం చేసుకుంది. మూడో మ్యాచ్‌లోనే అదే జోరు కొన‌సాగిస్తోంది.

చివ‌రి వ‌న్డేలో శుభ్‌మ‌న్ గిల్ అద్భుతమైన శతకం సాధించి, మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. గిల్ 95 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 102 పరుగులు చేసి తన వన్డే కెరీర్‌లో ఏడో శతకం నమోదు చేసుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (43) అర్ధశతకానికి దగ్గరగా ఉండగా, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా 52 పరుగులతో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. భారత బ్యాటింగ్ లైనప్ మెరుగైన ప్రదర్శన చూపిస్తోంది. ప్ర‌స్తుతం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 35 ఓవ‌ర్ల‌కు 226 ప‌రుగులు చేసింది. ఇంకా 15 ఓవ‌ర్లు మిగిలి ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment