రతన్ టాటా ఫ్రెండ్‌కి టాటా మోటార్స్‌లో కీలక పదవి

రతన్ టాటా ఫ్రెండ్‌కి టాటా మోటార్స్‌లో కీలక పదవి

Summarize with AI

ర‌త‌న్ టాటా స్నేహితుడు, టాటా గ్రూప్‌న‌కు అత్యంత ఆప్తుడిగా పేరుగాంచిన శంతను నాయుడు, ఇప్పుడు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలను చేపట్టనున్నారు. దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంత‌ను, కంపెనీలో జనరల్ మేనేజర్ అండ్‌ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్‌గా నియమితులయ్యారు.

ఈ విషయాన్ని స్వయంగా శంతను నాయుడు తన లింక్డ్ ఇన్ (LinkedIn)లో పోస్ట్ ద్వారా వెల్లడించారు. “టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్ అండ్‌ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.

ఇప్పటికే టాటా గ్రూప్‌లో వివిధ బాధ్య‌తలను నిర్వహించిన శంతను, ఈ కొత్త పదవిలో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశం ఉన్న‌ట్లుగా టాటా గ్రూప్ అభిప్రాయ‌ప‌డుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment