చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

Summarize with AI

నటుడు, సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా సూద్ చారిటీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లను విరాళంగా అందించింది.

సీఎంతో భేటీ అయిన సోనూసూద్, ఈ అంబులెన్స్‌లను అధికారికంగా ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం సీఎం చంద్రబాబు వాటిని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్‌లు దోహదపడతాయని ఆయన అన్నారు.

సోనూసూద్ సామాజిక సేవను ప్రశంసించిన చంద్రబాబు, ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామ్యం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్ర‌బాబు అంగీక‌రిస్తే ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతానంటూ సోనూసూద్ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment