టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు (54) మృతి చెందారు. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌తో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన త్వరలో కోలుకుంటారని ఆశించారు. కాగా, ఆరోగ్యం క్షీణించి, ఈరోజు ఉదయం ఆయన క‌న్నుమూశారు. ఈ వార్త టాలీవుడ్‌లో అందరినీ షాక్‌కు గురిచేసింది.

వేదరాజు, టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులతో కలిసి పని చేశారు. ముఖ్యంగా అల్లరి నరేష్ నటించిన ‘మడత కాజా’, ‘సంఘర్షణ’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment