ఉద‌య‌నిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఉద‌య‌నిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో ఊర‌ట‌

Summarize with AI

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమ‌య్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని అవమానపరిచారని పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను విచారించడానికి నిరాకరించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 32 ప్రకారం రిట్‌‌ పిటిషన్లను ఎలా కొనసాగించగలరని జస్టిస్‌‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌‌ ప్రసన్న బి వరాలే ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తీర్పుతో ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతు లభించినట్లైంది. అనంతరం పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు, చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ పరిష్కారాలకు పిటిషనర్లకు కోర్టు అనుమతించింది. ఇది సామాజిక వర్గాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment