విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ సినిమా వివాదంలో కూరుకుపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను నిజస్వరూపంలో చూపించాలనే అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. “శివాజీ గారి చరిత్రను వక్రీకరించడం సరైనది కాదు. శంభాజీ మహారాజ్ పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని కథా నిర్మాణం జరగాలి” అని ఆయన స్పష్టం చేశారు.
వివాదాస్పద సన్నివేశంపై నిర్ణయం
సినిమాలో క్రియేటివిటీ ఉంటేనే అది అందరికి అర్థమవుతుందని, కానీ సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ వివాదం నేపథ్యంలో మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరూ మాట్లాడుకుంటున్న ఆ డాన్స్ సీన్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు వారు ప్రకటించారు.








