గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన సర్కార్ ఉద్యోగుల సంఖ్యను కుదించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
A కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని 6కి కుదించాలని, B కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని 7గురు, C కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని 8కి కుదిస్తూ నిర్ణజ్ఞం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగుల్లో సుమారు 40వేల మంది ఉద్యోగాలకు కోతపడనుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించే నిర్ణయంపై చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.
ఎన్నికల సమయంలో వలంటీర్లకు వరాలు కురిపించిన చంద్రబాబు.. ఎన్నికల అనంతరం అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థకు పక్కకునెట్టేశారని, రూ.10 వేల గౌరవ వేతనం అని మాటలు చెప్పి, తమను నిలువునా మోసం చేశారని ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్లు మండిపడుతున్నారు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కుదిస్తూ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.








