భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌ను కొత్త నిర్వచనం చెప్పారు. “తెలంగాణ జనతా గ్యారేజ్”గా పేర్కొన్నారు. BRS కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్మిక లోకానికి తమ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రకటించారు. “కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుంది,” అంటూ KTR, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు.
సమస్యల పరిష్కారానికి ఆహ్వానం..
KTR మాట్లాడుతూ, తెలంగాణ భవన్‌కు ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలను తెలియజేయాలని కార్మికులకు సూచించారు. “మేము సంస్థలతో, ప్రభుత్వంతో పోరాడి మీకు న్యాయం చేస్తాం” అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ అన్ని తరగతుల కార్మికుల కోసం పనిచేశారని, ఇలాంటి నాయకత్వం మరెక్కడా దొరకదని తెలిపారు.








అమరావతిలో పర్యావరణ విధ్వంసం.. జనసేన మాజీ నేత సంచలన వ్యాఖ్యలు