లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

Summarize with AI

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూట‌మిలోని టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మరోసారి పెల్లుబికింది. త‌మ మూడో త‌రం నాయ‌కుడు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జ‌న‌సేన‌ కౌంట‌ర్ ఎటాక్ ప్రారంభించింది. త‌మ లీడ‌ర్‌ పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామ‌ని ప్రకటించారు.

జనసేన నేతల సవాలు
టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్రంగా స్పందిస్తూ, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని చెప్పారు. పవన్ భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. “మా నాయకుని భద్రత పార్టీకి ఎంతో అవసరం” అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

హోంమంత్రి అనిత వ్యాఖ్యలు
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌న్న ప్ర‌పోజ‌ల్‌పై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆమె మీడియా ముందు మాట్లాడుతూ “అంతా దైవేచ్చ” అని జోస్యం చెప్పడంతో, ఇది టీడీపీ నేతలను కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment