అండర్వరల్డ్ డాన్ చోటా రాజన్ను శుక్రవారం జైలు అధికారులు ఢిల్లీ ఎయిమ్స్కి తరలించారు. అనారోగ్య కారణంగా అతనికి ముక్కు సర్జరీ(సైనస్) చేయాలని వైద్యులు నిర్ణయించారు. 1990లలో దావూద్ ఇబ్రాహీంకు సహాయకుడిగా పేరుగాంచిన చోటా రాజన్, 2015లో ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేసి, భారత్కు రప్పించారు.
2001 హత్య కేసులో జీవిత ఖైదు
చోటా రాజన్ గత కొన్ని దశాబ్ధాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. 2001లో హోటల్ వ్యాపారి జయశెట్టి హత్య కేసులో, ముంబై స్పెషల్ కోర్టు గతేడాది మే నెలలో అతనికి జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత జర్నలిస్ట్ జే డే హత్య కేసులో కూడా అతనికి మరోసారి జీవిత ఖైదు విధించబడింది.








