RTO చ‌ర్య‌లు.. 30 రోజులు ర్యాపిడో సేవలు బంద్

RTO చ‌ర్య‌లు.. 30 రోజులు ర్యాపిడో సేవలు బంద్

Summarize with AI

అహ్మదాబాద్ రవాణా శాఖ కార్యాల‌యం ర్యాపిడో బైక్ టాక్సీ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడో సేవలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోన్న తరుణంలో నిబంధనల ఉల్లంఘన గురించి ఆటో యూనియన్లు RTO అధికారులకు ఫిర్యాదు చేశాయి.

అగ్రిగేటర్ రూల్స్ 2020 ప్రకారం, వాణిజ్య ప్రయోజనాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించాలంటే పసుపు రంగు నంబర్ ప్లేట్లు మరియు ఇన్స్యూరెన్స్ ఉండాలి. అయితే, ర్యాపిడో ఈ నియమాలను పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

ప్రయాణికులకు తాత్కాలిక ఇబ్బందులు
ఈ ఆదేశాలు ర్యాపిడో వినియోగదారులకు తాత్కాలిక ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ర్యాపిడో సేవలు వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తూ, ప్రయాణాలను సౌకర్యవంతంగా మార్చడంతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందింది.

Join WhatsApp

Join Now

Leave a Comment