డీలిమిటేషన్‌తో ఏపీకి మేలు.. – చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌తో ఏపీకి మేలు.. - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Summarize with AI

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) అంశంపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌(Delimitation) ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న స్థానాలను 50 శాతం పెంచడం అన్ని రాష్ట్రాలకూ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మార్పు ఆంధ్రప్రదేశ్‌కు మంచి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.

డీలిమిటేషన్‌ (Delimitation) నేపథ్యంలో ఢిల్లీకి (Delhi) రావాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌(Piyush Goyal) తనకు ఫోన్‌ చేశారని చంద్రబాబు (Chandrababu Naidu) మంత్రులతో చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను(Pawan Kalyan) కూడా ఢిల్లీకి రావాలని కోరారని, అయితే ఇతర కార్యక్రమాల కారణంగా ఆయన రాలేకపోతున్నారని తెలిపారు.

మరోవైపు, ఎల్లుండి నుంచి కూటమి ఎంపీలంతా తప్పనిసరిగా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో కీలక పరిణామాల వేళ కూటమి ఎంపీలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

డీలిమిటేషన్‌పై(Delimitation) కేంద్ర ప్రభుత్వం (Central Government) వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీట్ల పెంపు, ప్రాతినిధ్యం అంశాలపై జాతీయ, రాష్ట్ర స్థాయిలో చర్చలు ఊపందుకున్న వేళ కూటమి వ్యూహాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment