ప్రారంభ‌మైన పంచాయ‌తీ పోరు.. 3,240 గ్రామాల్లో పోలింగ్

ప్రారంభ‌మైన పంచాయ‌తీ పోరు.. 3,240 గ్రామాల్లో పోలింగ్

Summarize with AI

విశాఖపట్నం, గుంటూరు మినహా 26 జిల్లాల్లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. 42 డివిజన్లు, 201 మండలాల పరిధిలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 709 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, 3,240 గ్రామపంచాయతీలలో పోలింగ్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల బరిలో మొత్తం 74,45,583 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 37,80,328 మంది, పురుష ఓటర్లు 36,64,884 మంది, ఇతరులు 371 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు, నామినేషన్ల ఉపసంహరణల అనంతరం 31,614 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 28,061 బూత్‌లలో 23,269 చోట్ల ఓటింగ్ జరగనుండగా, పర్యవేక్షణ కోసం 6,303 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్, 5,739 బూత్‌లలో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. సర్పంచ్ స్థానాల్లో తిరుపతి జిల్లాలో అత్యధికంగా 136, అన్నమయ్యలో 74, పల్నాడులో 72 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మరోవైపు రాష్ట్రంలోని 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,010 వార్డులకు గాను 41 ఏకగ్రీవం కాగా, మిగిలిన 964 వార్డుల్లో 2,968 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 24.98 లక్షల మంది ఓటర్లు ఉండగా, 2,698 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 819 సమస్యాత్మక, 597 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు భారీగా సిబ్బందిని నియమించడంతో పాటు పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. 23 కౌంటింగ్ కేంద్రాల్లో 115 హాళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment