డిసెంబర్‌ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

డిసెంబర్‌ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్‌ 5 నుంచి నిర్వహించాలని చంద్ర‌బాబు ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించి, పలు కీలక బిల్లులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల పురోగతి, ఉపాధి కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ సమావేశాల్లో పెట్టుబడుల రక్షణ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పారిశ్రామిక ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులకు చట్టపరమైన భరోసా కల్పించేలా ఈ బిల్లును రూపొందించనున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఎస్క్రో విధానాన్ని అమలు చేసే అంశం కూడా ఇందులో భాగంగా ఉండనుంది.

పలు రంగాల్లో సాధించిన అభివృద్ధిని అసెంబ్లీ వేదికగా వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతి, ఉపాధి కల్పనకు సంబంధించిన వివరాలను సభ ముందుంచే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, నిధుల కేటాయింపు వంటి అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment