కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇదే..

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ ఇదే..

Summarize with AI

టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తన 14వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. #KA14 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రికార్డ్’ (RECORD) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ‘పుష్ప’ సినిమాకు పనిచేసిన వీర కోగటం ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎర్రటి చంద్రుడి నేపథ్యంలో కిరణ్ అబ్బవరం ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, అశోక్ బండ్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘A Mysterious World Unfolds!’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ మిస్టరీ థ్రిల్లర్ తరహా కథాంశంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో గంటలు కట్టిన జంతువు తల, వీడియో కెమెరా రికార్డింగ్ స్క్రీన్‌ను పోలిన డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment