“పార్టీ (Party) కోసం కష్టపడిన కార్యకర్తలకు (Party Workers) అండగా ఉంటాం, సామాజిక న్యాయం చేస్తాం, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తాం” అంటూ చంద్రబాబు (Chandrababu Naidu), కూటమి నేతలు వల్లించిన నీతులు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్ (Zilla Parishad Chairperson) పదవుల కేటాయింపులో ప్రజాస్వామ్యం(Democracy), సామాజిక న్యాయం (Social Justice) అనే పదాలకు అర్థం లేకుండా పోయింది.
ప్రజలకు చెప్పేదొకటి, ఆచరణలో చేస్తున్నదొకటి అన్నట్లుగా.. కీలక పదవులన్నింటినీ అగ్రనాయకుల కుటుంబాలకు, ఎమ్మెల్యేల వారసులకే కట్టబెడుతూ బీసీ వర్గాలను, సామాన్య కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) నిలువునా మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కీలక జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ పీఠాలను సామాన్య నాయకులకు కాకుండా, ఇప్పటికే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకే అప్పగించడం సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
- ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీకి (Sai Navyasri) ఏలూరు జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కింది.
- శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను Paritala Sriram) శ్రీసత్యసాయి జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా కూర్చోబెట్టారు.
- వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి కుమారుడు పుత్తా నరసింహారెడ్డికి (Putta Narasimha Reddy)కడప జెడ్పీ పీఠాన్ని కట్టబెట్టారు.
- విజయనగరం జిల్లా బీసీ కోటాలో జరగాల్సిన చోట కూడా మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె మజ్జి సిరిసహస్రకు (Majji Sirisahasra) అవకాశం కల్పించడంపై ఇప్పటికే కుల ధ్రువీకరణ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ, వారసత్వానికే అధిష్ఠానం మొగ్గు చూపింది.
- పార్వతీపురం మన్యం జెడ్పీ చైర్మన్ వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్. గోవా గవర్నర్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు(Ashok Gajapathi Raju) మేనల్లుడు
- డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జెడ్పీ చైర్మన్ గొల్లపల్లి అమూల్య. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు(Gollapalli Suryarao) కుమార్తె
- మార్కాపురం జెడ్పీ చైర్మన్ కందుల రామిరెడ్డి. మార్కాపురం ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి(Kandula Narayana Reddy) సోదరుడు.
టీడీపీలో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కూటమిలో ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉంటే, ఆయన కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) కీలక మంత్రిగా, బావమరిది బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎమ్మెల్యేగా, లోకేష్ తోడల్లుడు భరత్ (M. Sri Bharat) ఎంపీగా అధికారాన్ని పంచుకుంటున్నారు.
జనసేనలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎంగా ఉండగా, ఆయన సోదరుడు నాగబాబుకు(Nagababu) ఎమ్మెల్సీ పదవితో పాటు, గతంలో ప్రకటించిన కేబినెట్ పదవి ఇవ్వలేదనే కారణంతో ఏకంగా ‘గ్రీన్కో చైర్మన్'(Greenko Chairman) అనే కొత్త పదవిని సృష్టించి మరీ కేబినెట్ ర్యాంకు కట్టబెట్టారు. అంతేకాకుండా చిరంజీవి (Chiranjeevi) కుమార్తెకు విజయవాడ కనకదుర్గ ఆలయ(Kanaka Durga Temple) ప్రత్యేక ఆహ్వానితురాలి పదవిని ఇచ్చారు.
బీసీలకు, సామాన్య కార్యకర్తలకు మొండిచెయ్యి
ఎన్నికల సమయంలో బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం గురించి గొప్పగా మాట్లాడిన చంద్రబాబు, అధికారం చేతికి రాగానే బీసీ వర్గాలను పూర్తిగా విస్మరించడంపై ఆ పార్టీలోని ఆశవహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన జెడ్పీ పీఠాలను ఆధిపత్య వర్గాలకు, ఎమ్మెల్యేల వారసులకు పంచిపెడుతూ.. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన బీసీ నాయకులను, క్షేత్రస్థాయి కార్యకర్తలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకున్నారని మండిపడుతున్నారు.
ఒకే ఇంట్లో ఎమ్మెల్యే, అదే ఇంట్లో జెడ్పీ చైర్మన్ పదవులు ఉంటే ఇక సామాన్యులకు రాజకీయాల్లో అవకాశం ఎక్కడిదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా అధిష్ఠానం తీసుకున్న ఈ వారసత్వ నిర్ణయాలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా చంద్రబాబు చెప్పే సామాజిక న్యాయం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.








