ఎంఎస్ ధోనీకి వైఎస్ జగన్ అభినంద‌న‌లు

ఎంఎస్ ధోనీకి వైఎస్ జగన్ అభినంద‌న‌లు

Summarize with AI

భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోనీ.. తాజాగా ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు ప‌లికారు. ఐపీఎల్ నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించిన మిస్ట‌ర్ కూల్‌.. మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్ట‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఎక్స్ వేదిక‌గా ధోనీకి శుభాకాంక్ష‌లు చెబుతూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. రాంచీలో ఓ సామాన్య కుటుంబం నుంచి ప్రారంభమైన ధోనీ ప్రస్థానం క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించే వరకు సాగిందని కొనియాడారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు ధోనీ ప్రయాణం నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.

కేవలం ట్రోఫీలు సాధించడమే కాకుండా, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి జట్టును ముందుండి నడిపించిన గొప్ప నాయకుడు ధోనీ అని వైఎస్ జగన్ ప్రశంసించారు. ఒత్తిడిని తనపై వేసుకుంటూ చిరునవ్వుతో జట్టుకు దిశానిర్దేశం చేసిన అసాధారణ కెప్టెన్‌గా అభివర్ణించారు. అద్భుతమైన ఆటతీరు, నాయకత్వ పటిమతో ధోనీ భావితరాలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు.

ధోనీ సాధించిన విజయాలు, అందించిన స్ఫూర్తి క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైఎస్ జగన్ అన్నారు. మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపడుతున్న ధోనీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు, సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment