ఏపీకి మరో ముప్పు.. అక్వాన్ తుఫాన్ వేగం ఎంతో తెలుసా?

ఏపీకి అక్వాన్ తుఫాన్ ముప్పు.. గంటకు 145 కి.మీ. వేగంతో గాలులు!

Summarize with AI

బంగాళాఖాతంలో (Bay of Bengal) కొనసాగుతున్న అక్వాన్ తుఫాన్ (Cyclone Aquan) మరింత బలపడనుంది. ఈ రోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా, రేపటికి అతితీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. నవంబర్ 20న నెల్లూరు–తుని (Nellore-Tuni) మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.

అక్వాన్ తుఫాన్ ప్రభావంతో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy to Very Heavy Rainfall) కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉంది.

తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment