తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెంచరీ విధ్వంసం!

తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెంచరీ విధ్వంసం!

Summarize with AI

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 వన్డే ఆసియా కప్ 2026లో అదరగొట్టాడు. యూఏఈతో జరిగిన గ్రూప్-A చివరి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒమన్‌లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు చేశాడు. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానితో తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించిన ఆర్యవీర్.. వికే వినీత్‌తో కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వినీత్ 67 పరుగులు చేయగా, ఆర్యవీర్ 131 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 309 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ప్రదర్శనకు ఆర్యవీర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 239 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. యూఏఈ తరఫున అహ్మద్ ఖుదాదాద్ 74 పరుగులతో రాణించగా, భారత బౌలర్ ఈశాన్ సూద్ 37 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. దీంతో నవంబర్ 12న జరగనున్న సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment