తమిళనాడు ముఖ్యమంత్రి(Tamil Nadu Chief Minister), కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు(Movies) గుడ్‌బై చెప్పిన విజయ్.. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల(Government Welfare Schemes) ప్రచారం కోసం మరోసారి మేకప్ (Makeup) వేసుకోనున్నారు. అయితే ఈసారి సినిమా కోసం కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ ప్రకటనలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
సాధారణంగా ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాల ప్రచారం కోసం సినీ ప్రముఖులను(Film Celebrities) బ్రాండ్ అంబాసిడర్లుగా (Brand Ambassadors)నియమించుకుంటాయి. అయితే తమిళనాడు సీఎం విజయ్(CM Vijay) మాత్రం తన ప్రభుత్వ పథకాలకు తానే ప్రచారకర్తగా(Promoter) మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రత్యేక యాడ్ ఫిల్మ్‌ను(Advertisement Film) తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఈ యాడ్స్‌కు దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణ ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా సినిమా స్థాయిలో ఈ యాడ్‌ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ స్టార్ ఇమేజ్‌కు తగినట్లుగా ఈ ప్రకటనను రూపొందించనున్నారు.
ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలతో బిజీగా ఉన్న విజయ్ ఈ ప్రత్యేక యాడ్ షూటింగ్(Special Ad Shooting) కోసం రెండు రోజుల సమయం కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల (By-Elections) ప్రక్రియ ముగిసిన తర్వాత చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది.
సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు ప్రకటించిన విజయ్ మళ్లీ కెమెరా (Camera) ముందుకు రానుండటం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘జన నాయకుడు’ తన చివరి సినిమా అని ప్రకటించిన విజయ్.. ఇప్పుడు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం తెరపై కనిపించబోతున్నారు.
గతంలో విజయ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘యోహాన్’ (Yohan) సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన ద్వారా వీరిద్దరి కాంబినేషన్ తెరపైకి వచ్చే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది.








