అనంతపురంలో కూటమి నేతల దాడులు.. పోలింగ్ వేళ పలుచోట్ల ఉద్రిక్తత!

అనంతపురంలో కూటమి నేతల దాడులు.. పోలింగ్ వేళ పలుచోట్ల ఉద్రిక్తత!

Summarize with AI

అనంతపురం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (Municipal Elections Polling) వేళ అనంతపురం నగరంతో పాటు తాడిపత్రిలోనూ(Tadipatri) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ(TDP) కూటమి నాయకులు దౌర్జన్యాలకు దిగుతూ వైఎస్సార్‌సీపీ (YSRCP) కార్యకర్తలు, అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు. నగరంలోని పలు డివిజన్లలో కూటమి నాయకులు రిగ్గింగ్ లు, వైసీపీ వారిపై దాడులకి తెగపడ్డారు. ఈ ఘటనలపై ఓటర్లు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు.

39వ డివిజన్‌లో వైసీపీ నేతలపై కర్రలతో దాడి చేశారని, 40వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థిని భర్త గవ్వల లోకనాథ్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) అనుచరులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. తాడిపత్రి (Tadipatri) ఐదో వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన వైసీపీ కార్యకర్త హాజీపై కూడా టీడీపీ నాయకులు దాడి జరిగిందని వాపోయారు.

పలు డివిజన్లలో రిగ్గింగ్

అనంతపురం నగరంలోని 45వ డివిజన్ జ్ఞాన సరస్వతి స్కూల్ (Jnana Saraswathi School) పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకుల రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్త విశ్వనాథరెడ్డిపై (Viswanath Reddy) దాడి జరిగింది. ఈ ఘటనలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డికి (Anil Kumar Reddy) గాయాలయ్యాయి. 30వ డివిజన్‌లో టీడీపీ, బీజేపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ మండిపడింది. 47వ డివిజన్ సీవీఆర్ స్కూల్ (CVR School) పోలింగ్ బూత్ వద్ద దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ యువకుడిని వైసీపీ నాయకులు పట్టుకుని దగ్గరుండి పోలీసులకి అప్పగించారు.

పోలీసుల తీరుపై వైసీపీ ఆగ్రహం..

పలు ప్రాంతాల్లో దాడులు(Attacks), అక్రమాలు (Irregularities) జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వైసీపీ నాయకులు వైసీపీ తెలిపారు. ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి(Anantha Venkatarami Reddy), మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ (Ramesh Goud) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని, రిగ్గింగ్, దాడుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment