పులివెందుల: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ (Municipal Elections Polling) వేళ పులివెందులలో(Pulivendula) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ(YSRCP) ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా అడ్డుకుంటున్నారని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ వైసీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆందోళనకు దిగారు. పులివెందుల ఆర్వో కార్యాలయం (RO Office) ఎదుట సుమారు 70 మంది వైసీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో చిన్నయ్యతో(RDO Chinnaiah) మాట్లాడిన జగన్.. వైసీపీ ఏజెంట్లను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు.

‘‘ఎలక్షన్ అంటే పోటీ జరగాలి. ఎక్కడ చూసినా టీడీపీ (Telugu Desam Party) గూండాలే కనబడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవు’’ అంటూ అధికారులను వైఎస్ జగన్ నిలదీశారు. ‘‘అధికారులు మౌనంగా ఉంటే ప్రజాస్యామ్యానికే ప్రమాదం. ఇలా జరిగితే వీటిని ఎన్నికలంటారా?. ఎన్నికల్లో అక్రమాలపై ఆధారాలన్నీ ఉన్నాయి. బిహార్ పరిస్థితులను ఏపీలో(Andhra Pradesh) చూస్తున్నాం. మాజీ సీఎం నియోజకవర్గంలో ఈ పరిస్థితులేంటి?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పులివెందులలో వాళ్లకు నచ్చినట్టు ఓట్లు వేసుకుంటున్నారు. మాజీ సీఎంను కొట్టామని అనిపించుకోవాలంటే చేయండి. లాఠీఛార్జ్ (Lathi Charge) చేస్తారా చేయనీయండి.. అదొక్కటే మిగిలింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు ఎందుకు జరపడం లేదు. ఎన్నికలు జరపడానికి చంద్రబాబుకు (Chandrababu Naidu) ఎందుకంత భయం. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవాలు చేసుకుంటారా?. బూత్‌లను క్యాప్చర్ చేసి రిగ్గింగ్ (Rigging) చేసుకుంటున్నారు. ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు?’’ అంటూ వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అంతకుముందు.. వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏజెంట్లను అనుమతించకుండా, దాడులకు దిగడంపై చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ(YS Pramilamma), ఇతర అభ్యర్థులు నిరసన చేపట్టారు. రిపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయాన్నే బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేసుకున్నారన్న వైఎస్సార్‌సీసీ నేతలు.. ఏజెంట్లు, ఓటర్లు, మీడియా అనేది లేకుండా ఇష్టారీతిన దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఆర్వో కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని(YS Avinash Reddy) పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థులు కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారంతో ఆర్వో కార్యాలయానికి తాళం వేశారని. పులివెందులలో చోటుచేసుకున్న ఎన్నికల అక్రమాలను దేశమంతా గమనించిందని పేర్కొన్న వైసీపీ.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చూడాలని డిమాండ్ చేసింది.








