స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి!

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి!

Summarize with AI

స్పెయిన్‌లో(Spain) ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. టోలెడో ప్రావిన్స్‌లోని (Toledo Province) ఉర్డా(Urda) సమీపంలో రెండు హైస్పీడ్‌ రైళ్లు (High-Speed Trains) ఢీకొన్న ఘటనలో 46 మందికి పైగా మరణించారు. మాడ్రిడ్‌(Madrid) నుంచి సెవిల్లేకు(Seville) వెళ్తున్న ప్రభుత్వ రైల్వే సంస్థ రెన్ఫే (Renfe)కు చెందిన ఏవీ రైలు, ఇరియో (Iryo) సంస్థకు చెందిన మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి కొన్ని బోగీలు పట్టాలు తప్పి, రైలు ట్రాక్ పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో సుమారు 500 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. రెస్క్యూ టీమ్స్(Rescue Operations) రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద కారణంగా హైస్పీడ్‌ రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో(Railway Signalling System) సాంకేతిక సమస్యలు, రైళ్ల రాకపోకల నిర్వహణలో పొరపాట్లు జరిగాయా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పెయిన్‌ ప్రభుత్వం(Spanish Government) దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, బాధితులకు సహాయం అందించేందుకు అత్యవసర సేవలను ముమ్మరం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment