విజయ్‌పై ట్రోలింగ్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్..

విజయ్‌పై ట్రోలింగ్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్..

Summarize with AI

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల కరణ్ జోహార్(Karan Johar) నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్‌’(Koffee with Karan) సీజన్‌ 9లో పాల్గొన్న సందర్భంగా తమ పెళ్లి(Marriage) గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. విజయ్‌ను పెళ్లి చేసుకోవాలని తాను పలుమార్లు అడిగానని, దాదాపు ఏడాది పాటు ఈ విషయం గురించి మాట్లాడానని రష్మిక వెల్లడించడం, దీనిపై విజయ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల విమర్శలకు కారణమయ్యాయి. దీంతో కొందరు విజయ్‌ను విమర్శిస్తూ, రష్మికకు సంబంధంపై ఉచిత సలహాలు ఇవ్వడం ప్రారంభించారు.

ఈ పరిణామాలపై రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) సుదీర్ఘ పోస్ట్‌ ద్వారా స్పందించారు. తమ బంధం (Relationship) గురించి చాలామంది అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి విషయంలో విజయ్ సమయం తీసుకోవడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ, జీవితంలోని సంతోషాలు, కష్టాలను కలిసి ఎదుర్కోగలమా అనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇద్దరూ పెళ్లి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తమ ప్రేమను ప్రపోజల్స్ సంఖ్యతో కొలవలేమని, ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.

విజయ్‌పై తనకున్న ప్రేమను(Love) వ్యక్తం చేస్తూ, పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అమితంగా ప్రేమించడంలో తప్పేముందని రష్మిక ప్రశ్నించారు. విజయ్ తన జీవిత భాగస్వామి మాత్రమే కాకుండా, కష్టసుఖాల్లో అండగా నిలిచే మంచి స్నేహితుడని పేర్కొన్నారు. తమ వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయడం, కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగడం సరికాదని అన్నారు. విజయ్‌ను మళ్లీ మళ్లీ ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ, తమ బంధంపై వస్తున్న విమర్శలకు రష్మిక గట్టి సమాధానమిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment