వాట్సాప్‌, టెలిగ్రామ్‌కు కొత్త నిబంధనలు.. సిమ్‌ ఫోన్‌లో లేకపోతే ఇబ్బందులేనా?

జనవరి 1 నుంచి వాట్సాప్‌, టెలిగ్రామ్‌కు కొత్త నిబంధనలు.. సిమ్‌ ఫోన్‌లో లేకపోతే ఇబ్బందులేనా?

Summarize with AI

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిమ్‌ బైండింగ్‌ నిబంధనలు కీలకంగా మారనున్నాయి. టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (DoT) ఆదేశాల ప్రకారం, భారత మొబైల్‌ నంబర్‌తో పనిచేసే వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌చాట్‌ సహా పలు యాప్‌లు తమ ఖాతాలను సంబంధిత యాక్టివ్‌ సిమ్‌ కార్డుతో నిరంతరం అనుసంధానించాలి.

ఈ నిబంధనల అమలుకు 2026 డిసెంబర్‌ 31 వరకు గడువు విధించారు. దీంతో 2027 జనవరి 1 నుంచి రిజిస్టర్‌ చేసిన నంబర్‌కు సంబంధించిన సిమ్‌ కార్డు ఫోన్‌లో లేకుండానే యాప్‌లను ఉపయోగించే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సైబర్‌ మోసాలు, నకిలీ గుర్తింపులతో సందేశాలు పంపడం, భారత మొబైల్‌ నంబర్లను దుర్వినియోగం చేయడం వంటి వాటిని అరికట్టడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం.

ఈ మార్పులు ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులిద్దరికీ వర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా, వాట్సాప్‌ ఖాతాకు రిజిస్టర్‌ చేసిన సిమ్‌ను మరో ఫోన్‌లో ఉంచడం లేదా సిమ్‌ లేకుండా వై-ఫై ద్వారా యాప్‌ను ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొత్త నిబంధనల అమలు తర్వాత యాక్సెస్‌ సమస్యలు తలెత్తవచ్చు. అయితే, జనవరి 1 నుంచి అన్ని ఫోన్లలో వాట్సాప్‌, టెలిగ్రామ్‌ పనిచేయవని చెప్పడం సరికాదు. వాట్సాప్‌ వెబ్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్లను ప్రతి ఆరు గంటలకు తప్పనిసరిగా లాగ్‌అవుట్‌ చేయాలన్న గత నిబంధనను కూడా ప్రభుత్వం మార్చి, మోసపూరిత కార్యకలాపాల ముప్పు ఆధారంగా లాగ్‌అవుట్‌ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి వినియోగదారులు తమ రిజిస్టర్‌ చేసిన సిమ్‌ యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోవడంతో పాటు, యాప్‌ల నుంచి వచ్చే అధికారిక సూచనలను గమనించాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment