పవన్ వ్యాఖ్యలతో ర‌గిలిపోతున్న‌ టీడీపీ

పవన్ వ్యాఖ్యలతో ర‌గిలిపోతున్న‌ టీడీపీ

Summarize with AI

తమ‌ మద్దతుతోనే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సీఎం అయ్యారని, లేకపోతే రాష్ట్రంలో టీడీపీ(TDP) ఉనికే క‌నుమ‌రుగు అయ్యేదనే స్థాయిలో జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూట‌మిలో మంట పుట్టించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ బహిరంగంగా కోరడం, మరోవైపు టీడీపీని కించపరిచేలా మాట్లాడటంతో టీడీపీ లోలోప‌ల కుమిలిపోతూ.. సోషల్ మీడియా వేదికగా ర‌గిలిపోతోంది.

చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌పై చెలరేగిన వివాదం
రంపచోడవరం నియోజకవర్గంలో(Rampachodavaram Constituency) ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ శ్రేణులు ఎవరూ రోడ్డు మీదకు రాలేదని, ఆ సమయంలో జనసైనికులు, వీర మహిళలే రోడ్డు మీదకు వచ్చి అండగా నిలిచారని వ్యాఖ్యానించారు. తాము చేసిన త్యాగాలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా రగిలిపోతున్నాయి. “తమ మద్దతు, ఓటు బ్యాంకుతో గెలిచిన పవన్ కళ్యాణ్.. తమ పార్టీ శ్రేణుల పోరాటాన్ని కించ‌ప‌రిచేలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది” అంటూ టీడీపీ యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

పవన్ వ్యాఖ్యలపై వాస్తవాలను ప్రస్తావిస్తూ టీడీపీ నెటిజన్లు గట్టిగా నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్ 9న అరెస్టయ్యారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించింది సెప్టెంబర్ 14న. అప్పటికి టీడీపీ-జనసేన(TDP–Jana Sena) పొత్తుపై జనసైనికులకు స్పష్టత లేనప్పుడు, సెప్టెంబర్ 9నే టీడీపీ అధినేత కోసం నంద్యాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేసింది కేవలం టీడీపీ శ్రేణులేనని గుర్తుచేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సమీపిస్తున్న తరుణంలో, రెండు పార్టీల మధ్య పెరుగుతున్న ఈ మాటల యుద్ధం కూటమికి కొత్త తలనొప్పిగా మారింది. ఇప్ప‌టికే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, పరస్పర ఆధిపత్య పోరు నేపథ్యంలో నేతల మధ్య పెరుగుతున్న దూరానికి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్నాయంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు.

అంతిమంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు కూట‌మికే న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని, పరస్పర విమర్శలతో రగులుతున్న ఈ వివాదం రాబోయే రోజుల్లో ఏ రూపం దాల్చుతుందనేది ఉత్కంఠగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment