నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోధన్ మండలం ఆమ్దాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవత్ రక్షిత్ (26) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.
బోధన్ పట్టణంలోని ఆటో నగర్ పెట్రోల్ బంక్ సమీపంలో రక్షిత్ బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలను పోలీసులు గుర్తించాల్సి ఉంది.








