ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్న దేశ రాజ‌ధాని

ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్న దేశ రాజ‌ధాని

Summarize with AI

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) (CEC) తక్షణమే తన పదవికి రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి చేపట్టిన భారీ ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ (Delhi) శుక్రవారం అట్టుడికిపోయింది. విపక్ష నేతలు, పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలిరావడంతో ఢిల్లీ వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి.

ఢిల్లీలో స్తంభించిన రవాణా
ఇండియా కూటమి నేతల ఆందోళనలు, నిరసన ర్యాలీల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు ఢిల్లీ రైల్వే స్టేషన్ (Delhi Railway Station) మార్గంతో పాటు పలు ప్రధాన రహదారులను మూసివేశారు. దీంతో నగరంలో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష ఎంపీలు సత్యాగ్రహ శైలిలో ముందుకెళ్లారు.

రాజ్‌ఘాట్ వద్ద ఉద్రిక్తత
భారీ ర్యాలీగా బయలుదేరిన ఇండియా కూటమి ఎంపీలు, ముఖ్య నాయకులు రాజ్‌ఘాట్‌కు (Raj Ghat) చేరుకున్నారు. మహాత్మా గాంధీ సమాధి (Mahatma Gandhi Memorial) వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు వెళ్తున్న విప‌క్ష నేత‌ల‌ను పోలీసులు అడుగ‌డుగునా అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకా గాంధీలతో(Priyanka Gandhi) పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఇతర మిత్రపక్షాల అగ్రనేతలు, ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ బద్ధ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకే ఈ పోరాటమని, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించే వరకు తమ ఆందోళనలు సడలించేది లేదని విపక్ష నేతలు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment