భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ

భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ

Summarize with AI

విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్‌నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని డీఫాల్టర్‌గా ప్రకటించారు. 2014-2020 మధ్య జగత్ డెయిరీని విజయ డెయిరీకి సమానంగా నడిపించినప్పటికీ, ఆ సమయంలో 30% వ్యాపారం నష్టపోయిందని వెల్లడించారు. ఆ జగత్‌ డెయిరీ వర్కింగ్‌ పార్ట్‌నర్‌గా భూమా విఖ్యాత్‌ ఉంటూ విజయ­డెయిరీ ద్వారా రూ.1.30 కోట్లు రుణం తీసుకున్నార‌ని, పలుమార్లు నోటీసులు పంపినా అప్పు చెల్లించలే­ద‌ని ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలిపారు.

విజయ పాల డెయిరీ త‌న నిర్ణయాలను వెల్ల‌డించింది. డీఫాల్టర్‌గా భూమా విఖ్యాత్‌ను గుర్తిస్తూ.. ప్రైవేట్ డెయిరీలో పనిచేసిన వారికి విజయ డెయిరీలో స్థానం లేదని స్పష్టం చేశారు. చక్రవర్తులపల్లె పాల సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేశారు. విజయ డెయిరీ తాజా నిర్ణయాలు భూమా కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక, నైతిక ప్రభావాలు చూపనున్నాయి. ఈ పరిణామాలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment