శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు దుర్మరణం

శ్రీసిటీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు దుర్మరణం

Summarize with AI

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పరిశ్రమలో నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక బృందాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి. గాయపడిన కార్మికులను హుటాహుటిన సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పారిశ్రామిక ప్రాంతంలో ఇంత భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, బాయిలర్ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్మికుల భద్రత కోసం అవసరమైన సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికుల కుటుంబాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

పేలుడుకు అసలు కారణమేంటి? భద్రతా నిబంధనల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారుల విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment