ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి పాలనలో పాఠశాలలు(Schools), ప్రభుత్వ హాస్టళ్లలో(Government Hostels) చదువుకుంటున్న పేద విద్యార్థినులకు రక్షణ కరువైంది. ఇటీవల తునిలో ఒక విద్యార్థినిని హాస్టల్ నుంచి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి (Sexual Assault) యత్నించిన ఘటన మరువకముందే.. తాజాగా ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఘోరం విస్తుగొలుపుతోంది. బాధ్యతాయుతంగా చూడాల్సిన హాస్టల్ సిబ్బందే విద్యార్థినులను కామాంధులకు ఎరగా వేస్తున్న తీరు చూస్తుంటే ‘ఇరుముడి’(Irumudi) సినిమాలోని దారుణ సన్నివేశాలు కళ్లముందు కదులుతున్నాయంటున్నారు ప్రజలు.
ఒంగోలులో భయంకర ఘటన..
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGVB)లో దారుణం వెలుగు చూసింది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అమాయక విద్యార్థినులను మభ్యపెట్టిన వంట మనిషి, వారిని ఒంగోలులోని(Ongole) ఒక వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. ఆ ఇంట్లో ఉన్న నిందితుడు బాలికలతో అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు.
తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థినులు ఆ వ్యక్తి నుంచి చాకచక్యంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. స్థానికులను ఆశ్రయించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో ఈ రాక్షసపర్వం బయటపడింది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోతూ నిందితుడి ఇంటిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడిని డీఆర్డీఏ (DRDA)లో పనిచేసి రిటైర్ అయిన వెంకటేష్‌గా అధికారులు గుర్తించారు.
విద్యార్థినులకు రక్షణ ఎక్కడ?
బాధ్యతగల స్థానాల్లో ఉంటూ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ వంట మనిషే వారిని ఇలా కామాంధుల చేతుల్లోకి నెట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. చంద్రబాబు పాలనలో పేద విద్యార్థుల భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారనడానికి ఈ ఘటనలే ప్రత్యక్ష నిదర్శనం అంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
- ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఉన్న పేద, వెనుకబడిన వర్గాల ఆడపిల్లలకు అసలు భద్రత ఉందా లేదా?
- విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్ ఈ వరుస దారుణాలపై ఏం సమాధానం చెబుతారు?
- ఆడపిల్లల రక్షణ పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
పాఠశాలల్లో విద్యాభివృద్ధి, భద్రత అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్న కీచకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించి హాస్టళ్లలో భద్రతను సమీక్షించాలని, బాధ్యులపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
🚨 ఏపీలో అత్యంత దారుణ ఘటన
— Telugu Feed (@Telugufeedsite) September 30, 2026
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులను ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీవీబీ విద్యార్థినులను మభ్యపెడుతున్న హాస్టల్ వంట మనిషి
ఒంగోలులోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
విద్యార్థినులతో… pic.twitter.com/cujnVmLZ65








