హైదరాబాద్ (Hyderabad) షేక్‌పేటలోని (Shaikpet) తన నివాసం సమీపంలో వినోభానగర్ హనుమాన్ ఆలయం (Hanuman Temple) నుంచి అర్ధరాత్రి (Midnight) 2–3 గంటల వరకు అధిక శబ్దంతో(Loud Noise) సంగీతం వినిపిస్తోందంటూ నటుడు అల్లు శిరీష్(Allu Sirish) హైదరాబాద్ సిటీ పోలీసులను (Hyderabad City Police) ఆశ్రయించారు. ఈ శబ్దం వల్ల అపర్ణా వన్ సొసైటీలోని(Aparna One Society) వృద్ధులు(Senior Citizens), చిన్నారులు(Children), ఉద్యోగులు (Employees) ఇబ్బంది పడుతున్నారని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. గతంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, గణేశ్ నిమజ్జనం (Ganesh Immersion) కారణంగా సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని సూచించారని, పండుగ ముగిసినా శబ్దం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించి.. విషయాన్ని ఫిలింనగర్ ఎస్‌హెచ్‌వోకు (Film Nagar SHO) పంపినట్లు తెలిపారు.
అయితే అల్లు శిరీష్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు నెటిజన్లు అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్లు వినియోగించడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించడాన్ని ప్రశ్నించడం సరైనదేనని ఆయనకు మద్దతు తెలిపారు. మరోవైపు, కొందరు మాత్రం ఆలయ శబ్దంపై మాత్రమే ఎందుకు స్పందిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ, ఇతర మతపరమైన ప్రదేశాల్లోని లౌడ్‌స్పీకర్లపై కూడా ఇదే విధంగా స్పందించాలని కోరారు. మరికొందరు సినిమా ఈవెంట్లు, ఇతర బహిరంగ కార్యక్రమాల సమయంలో ఏర్పడే శబ్దం, ట్రాఫిక్ సమస్యలను కూడా ప్రస్తావించారు.
ఈ విమర్శలపై అల్లు శిరీష్ మరోసారి స్పందిస్తూ.. తాను హనుమంతుడిని(Lord Hanuman) పూజించే వ్యక్తినేనని, తన ఫిర్యాదు మతపరమైన భక్తికి(Religious Devotion) వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాత్రి 2 గంటలకు డీజే(DJ) పెట్టి పెద్ద శబ్దంతో సంగీతం వినిపించడం భక్తి కాదని, తాను ప్రశ్నించింది కేవలం సివిక్ సెన్స్, శబ్ద కాలుష్యానికి సంబంధించిన అంశమేనని తెలిపారు. దీంతో శబ్ద కాలుష్యం, మతపరమైన వేడుకలు, రాత్రివేళ లౌడ్‌స్పీకర్ల వినియోగంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.








