యూపీఐ కొత్త ఛార్జీలపై సుప్రీంకోర్టు ఆరా..

యూపీఐ కొత్త ఛార్జీలపై సుప్రీంకోర్టు ఆరా..

Summarize with AI

రూ.2,000కుపైగా జరిగే కొన్ని యూపీఐ(UPI)వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (MDR) అమలు చేయనున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్రం(Central Government), ఆర్బీఐ(RBI), ఎన్‌పీసీఐ (NPCI) నుంచి వివరణ కోరింది. ఈ ఛార్జీలకు చట్టబద్ధమైన ఆధారం ఏంటి, వసూలైన మొత్తం ఎవరికి ఎలా పంపిణీ అవుతుంది అనే అంశాలపై వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని సవాలు చేస్తూ న్యాయవాది అంజన్ దత్తా (Anjan Datta) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అక్టోబర్ 15 నుంచి ఛార్జీల అమలును నిలిపివేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

కొత్త విధానం ప్రకారం వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే P2P లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ (Charge) ఉండదు. అలాగే రూ.2,000 వరకు ఉన్న వ్యాపార చెల్లింపులు, నిర్దిష్ట చిన్న వ్యాపారుల లావాదేవీలు కూడా మినహాయింపులో ఉంటాయి. అర్హత కలిగిన రూ.2,000కుపైగా P2M లావాదేవీలపై 0.4 శాతం MDR విధిస్తారు; రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేశారు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ రంగాలకు రూ.5 ఫ్లాట్ MDRగా నిర్ణయించారు. ప్రభుత్వం ప్రకారం ఈ MDRను వినియోగదారుల నుంచి వసూలు చేయరు; పేమెంట్ ఎకోసిస్టమ్‌లోని (Payment Ecosystem) బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్ ప్రొవైడర్ల (UPI App Providers)మధ్య పంపిణీ చేస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment