‘పేరు రాసి పెట్టుకోండి.. సినిమా మ‌నం చూపిద్దాం’

'పేరు రాసి పెట్టుకోండి.. సినిమా మ‌నం చూపిద్దాం'

Summarize with AI

చంద్రబాబు (Chandrababu) పాలనంతా అరాచకపర్వం(Anarchy), ప్రశ్నిస్తే అక్రమ కేసులు(Illegal Cases), వేధింపులు(Harassment), వాటన్నింటినీ ప్రజల్లో గట్టిగా ఎండగట్టాలని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ (YS Jagan Mohan Reddy) సూచించారు. రాష్ట్రంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై కేసుల పరంప‌ర‌, అక్ర‌మ అరెస్టులపై తీవ్రంగా స్పందించారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖపట్నం (Greater Visakhapatnam) పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు(Coalition Government Failures), విశాఖ పరిధిలో నెలకొన్న తాగునీటి ఎద్దడి, భూ క్రయవిక్రయాల్లో అక్రమాలు, శాంతిభద్రతల క్షీణతపై(Deterioration of Law and Order) వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విశాఖలో నీటి కష్టాలు – పోలవరం నిర్వీర్యం
విశాఖపట్నం చరిత్రలోనే తొలిసారిగా తాగునీటి కొరత (Drinking Water Shortage) ఏర్పడిందని, మూడు రోజులకు ఒకసారి నీరు ఇచ్చే దుస్థితికి ప్రస్తుత పాలనే కారణమని వైఎస్ జగన్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించి ఉంటే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తానికి గ్రావిటీ ద్వారా నీరు అందేదని గుర్తుచేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి 75 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పణంగా పెట్టడమే కాకుండా, నగరాన్ని దాహార్తితో అలమటించేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ‌లో లోకేష్ తోడ‌ల్లుడి అవినీతి
విశాఖలో అత్యంత విలువైన భూములను కూటమి ప్రభుత్వం తమ అనుకూల వర్గాలకు కట్టబెడుతోందని, గీతం విద్యాసంస్థల (GITAM Educational Institutions) పేరుతో రూ.5,000 కోట్ల విలువైన భూములను నారా లోకేష్(Nara Lokesh) తోడ‌ల్లుడికి అప్ప‌నంగా అప్పగించారని చెప్పారు. రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తన తోడల్లుడికి ఇచ్చారంటే.. ఈ ప్రభుత్వంలో ఎంత అవినీతి (Corruption) జరుగుతోందో ఊహించుకోవాల‌న్నారు. ఈ పాపాలు ఎక్క‌డికిపోవూ.. అనుభ‌వించే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయని హెచ్చ‌రించారు.

గత వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేసిన పునాదులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ‌లో 1,30,000 మందికి ఇళ్ల పట్టాలు, కేజీహెచ్ ఆధునీకరణ, భోగాపురం ఎయిర్‌పోర్ట్(Bhogapuram Airport), మూలపేట పోర్టు (Mulapeta Port) పనులు, గూగుల్(Google), అదానీ డేటా సెంటర్ల (Adani Data Centers) ద్వారా పెట్టుబడుల సమీకరణ, రూ.600 కోట్లతో హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ సరఫరా, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్దానం స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించామ‌న్నారు.

విద్య, వైద్యం, సంక్షేమంలో నాడు-నేడు (Nadu-Nedu)ద్వారా పాఠశాలల రూపురేఖల మార్పు, ఆరో తరగతి నుంచే డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆరోగ్యశ్రీ (Aarogyasri) పరిమితి రూ.25 లక్షలకు పెంపు, విలేజ్ క్లినిక్స్, సచివాలయాలు, ఈ-క్రాప్, రైతు భరోసా కేంద్రాల ద్వారా నిరంతర సేవలు అందించామ‌న్నారు.

డిజిట‌ల్ డైరీ
ప్రతిపక్ష శ్రేణులపై అక్రమ కేసులు పెడుతూ ‘రెడ్ బుక్'(Red Book) పాలన సాగిస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండటానికి ‘డిజిటల్ డైరీ’ని (Digital Diary) అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పారు. అక్రమాలకు పాల్పడే అధికారులు, పోలీసుల వివరాలను ఇందులో నమోదు చేస్తామని, భవిష్యత్తులో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చట్టప్రకారం లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. పోలీసులు చంద్రబాబు ఒత్తిళ్లకు తలవంచకుండా నిష్పక్షపాతంగా ధర్మం పాటించాలని పిలుపునిచ్చారు.

ఏ పోలీస్ అధికారి అయినా అన్యాయం చేసే అత‌ని పేరు మాత్రం గుర్తుపెట్టుకొని వెంట‌నే డిజిట‌ల్ డైరీలో ఎక్కించాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. టైమ్ చక్రం ఫాస్ట్ గాతిరుగుతుంద‌ని, కళ్ళు మూసుకొని తెరిచేసరికి రెండున్నరేళ్లు పూర్త‌యింది.. ఇంకా మిగిలింది మ‌రో రెండున్న‌రేళ్లే.. ఆ తర్వాత ఐదేళ్లు మమ్మల్ని మీరు చూస్తారు గ‌ట్టిగా చెప్పాల‌న్నారు.

మ‌నం అధికారంలోకి వ‌చ్చిన డిజిటల్ డైరీని ఓపెన్ చేస్తాం.. లెక్కలు తీస్తాం.. వాళ్లంద‌రినీ చ‌ట్టం ముందు నిల‌బెట్టి సినిమా చూపించే కార్యక్రమం కచ్చితంగా చేస్తామ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు హామీ ఇచ్చారు. ఈసారి మాత్రం జగన్ 2.0 లో కార్యకర్త అనేవాడు నెంబర్ వన్ గా ఉంటాడని మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్ పున‌రుద్ఘాటించారు.

సూపర్ సిక్స్(Super Six) హామీల అమలు వైఫల్యాన్ని, విశాఖ సమస్యలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ధైర్యంగా పోరాడాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గట్టిగా యుద్ధం చేయాల‌ని, ఎమ్మెల్యే కాండిడేట్ దగ్గర నుంచి వైసీపీ అగ్రనాయకత్వం వ‌ర‌కు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు తోడుగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment