తెలంగాణ శాసనసభలో(Telangana Legislative Assembly) ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ (Erravelli Farmhouse)పరిసరాల్లోని భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ప్రభుత్వ భూములు(Government Lands), ప్రైవేట్ భూముల (Private Lands) వివరాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎర్రవెల్లి పరిసరాల్లో సుమారు 385 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ఉందని, అలాగే మాజీ సీఎం కేసీఆర్(KCR), ఆయన కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న భూములపై పూర్తి వివరాలను తేల్చాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. నిర్ణీత వ్యవధిలో భూముల వివరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.
కేసీఆర్ (KCR) కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూముల వివరాలపైనా సీఎం సభలో ప్రస్తావనలు చేశారు. నిబంధనలకు మించి భూములు ఉన్నాయన్న ఆరోపణలపై రికార్డులను పరిశీలించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణకు (Encroachment) గురయ్యాయా అనే అంశాన్ని నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. భూ లావాదేవీలు(Land Transactions), భూముల బదిలీలపై(Land Transfers) సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ (Erravelli Farmhouse) చుట్టూ ఇటీవల కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న పరిణామాలపై కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.








