వీసాల‌ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే మోసం..‘కాక్రోచ్’ సంచ‌ల‌న ట్వీట్‌

వీసాల‌ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే మోసం..‘కాక్రోచ్’ సంచ‌ల‌న ట్వీట్‌

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై ‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ అనే ఎక్స్ (X) హ్యాండిల్ సంచలన ఆరోపణలు చేసింది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసం చేశారని, అమెరికాలో హెచ్‌-1బీ, ఓపీటీ, సీపీటీ, హెచ్‌4 ఈఏడీ ఉద్యోగుల నుంచి భారీగా డబ్బులు దోచుకున్నారని కాక్రోచ్ చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

అమెరికాకు వెళ్లి కన్సల్టెన్సీల ఏర్పాటు
వెనిగండ్ల రాము 1994లో ఎఫ్‌-1 విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లారని, అనంతరం గ్రీన్ కార్డు పొందారని.. ఆ తర్వాత పలు హెచ్‌-1బీ కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసి ‘బాడీ షాపింగ్’ ద్వారా భారీ మొత్తంలో సంపాదించారని ఆరోపించింది. అమెరికాలో ఆయన సంపాదన ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని పేర్కొంది. వెనిగండ్ల రాముకు పలు సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ పేర్కొంది.

వాటిలో Verdict Holdings LLC (Eficens Systems LLC), Magtech Consulting & Solutions LLC, Morgan Stanley Smith Barney LLC, Ogni GP LLC, Elear LLC, Techsynergy LLC, Lilly Housing LLC, Castle Housing LLC, Stoney Point Housing LLC, Grayson Housing LLC వంటి సంస్థలను ప్రస్తావించింది. ఈ సంస్థల ద్వారా వేలాది హెచ్‌-1బీ దరఖాస్తులు దాఖలయ్యాయని ఆరోపించింది.

హెచ్‌-1బీ, ఓపీటీ, సీపీటీ, హెచ్‌4 ఈఏడీ కార్మికుల నుంచి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము డబ్బులు దోచుకున్నారని ‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ బ‌య‌ట‌పెట్టింది. 5,000 మందికి పైగా హెచ్‌-1బీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని, అధికారిక సంస్థలు దర్యాప్తు చేస్తే భారీ స్థాయిలో వీసా మోసం బయటపడుతుందని పేర్కొంది. అలాగే అమెరికా ప్రభుత్వం అందించిన పీపీపీ (Paycheck Protection Program) నిధులను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించింది.

ఏపీలో శాస‌న‌ సభ్యుడిగా ఉన్న రాముకు అమెరికాలో ఘన స్వాగతం లభించిందని, ఆయన కుమార్తె వివాహానికి 20–30 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయిందని కూడా ఆ పోస్టులో ఆరోపించారు. అమెరికాలో వీసాలు, ఉద్యోగాల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బుతో భారత్‌లో రాజకీయ పలుకుబడి, ప్రతిష్ఠ పెంచుకున్నారని ‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

వీసా మోసాలపై దాడులు చేయాలి
అమెరికాలో దశాబ్దాలుగా హెచ్‌-1బీ కన్సల్టెన్సీల పేరుతో మోసాలు జరుగుతున్నాయని ‘కాక్రోచ్ ఎక్స్‌పోజర్’ పేర్కొంది. సంబంధిత సంస్థలపై అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్, ICE అధికారులు దాడులు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. అక్రమంగా పొందిన గ్రీన్ కార్డులు, హెచ్‌-1బీ వీసాలను రద్దు చేయాలని కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment