ఏపీలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాదగయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం టోకెన్ల పంపిణీ మరోసారి వివాదాస్పదంగా మారింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి వ్రతంలో పాల్గొనేందుకు వచ్చిన మహిళా భక్తులకు టోకెన్ల పంపిణీ విషయంలో రాజకీయ వివక్ష చూపుతున్నారంటూ పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సభ్యత్వం ఉన్నవారికే టోకెన్లు పంపిణీ చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శుక్రవారం జరిగే వరలక్ష్మీ వ్రత పూజల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం నుంచే మహిళలు పాదగయ క్షేత్రానికి చేరుకున్నారు. టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో మహిళలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాధారణంగా ఆలయంలోనే అధికారులు టోకెన్లను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత రెండేళ్లుగా జనసేన నేతలు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు.
అయితే ఈసారి సుమారు 10 వేల టోకెన్లు జనసేన నాయకుల చేతుల్లోకి వెళ్లాయి. వారి ఆధ్వర్యంలోనే పంపిణీ జరిగిందని పలువురు మహిళలు ఆరోపించారు. గత ఏడాది నుంచే సామాన్య భక్తులను పక్కన పెట్టి జనసేన పార్టీ సభ్యత్వం ఉన్నవారికే టోకెన్లు అందిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పిఠాపురంలో అమ్మవారి పూజలోనూ జనసేన రాజకీయం
— Telugu Feed (@Telugufeedsite) September 3, 2026
మరోసారి వివాదస్పదంగా పిఠాపురం పాదగయా క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం టోకెన్ల పంపిణీ
జనసేన నేతల చేతుల్లో 10 వేల టోకెన్లు.. @JanaSenaParty సభ్యత్వం ఉన్నవారికే టోకెన్ల పంపినీపై మహిళా భక్తుల ఆగ్రహం
రేపు జరిగే శ్రావణ శుక్రవారం… https://t.co/Tc6lRauJpG pic.twitter.com/LmryxfanSx
టోకెన్ల కోసం క్యూలో ఉన్న మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పలువురు భక్తులు ఆరోపించారు. తమను ఇళ్ల నుంచి లాక్కొచ్చి కేసులు పెడతామంటూ బెదిరించారని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేయడం సంచలనంగా ఆరింది. అమ్మవారి సన్నిధిలో పూజ కోసం వస్తే ఇలా అవమానించడం ఏమిటని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
‘అమ్మవారి పూజలో కూడా రాజకీయాలేంటి?’ అంటూ మహిళా భక్తులు ప్రశ్నించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాజకీయ రంగు పులమడం సరికాదని, భక్తులందరికీ సమానంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టోకెన్ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు మహిళలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన సభ్యత్వం ఉన్నవారికే వరలక్ష్మీ వ్రతం టోకెన్లు ఇస్తే.. మిగిలిన భక్తుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘జనసేన నాయకుల భార్యలే పవన్ కల్యాణ్‌కు ఓట్లు వేశారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన పూజా కార్యక్రమంలో రాజకీయ జోక్యం లేకుండా అందరు భక్తులకు సమాన అవకాశాలు కల్పించాలని మహిళా భక్తులు డిమాండ్ చేస్తున్నారు.








అది క్లీన్చిట్ కాదు.. కేసు అబేట్! నా పోరాటం ఆగదు