జనసేన (Janasena) అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు(Pawan Kalyan) చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా శుభాకాంక్షలకు(Wishes) మోతాదుకు మించి పొలిటికల్ టచ్(Political Touch) ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల కోసం పని చేస్తున్నాడని కితాబిస్తూ చిరంజీవి రాసిన శుభాకాంక్షల ట్వీట్ వైరల్‌గా మారింది. ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’ అంటూ తన తమ్ముడిపై ప్రశంసలు కురిపించారు.
చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్‌లో నిబద్ధత(Commitment), ప్రేమ(Love), బాధ్యతతో(Responsibility) కూడిన సంకల్పం, ప్రజలకు మంచి చేయాలనే తపనను తాను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. తాను చేసే ప్రతి పనిలో పదిమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో వేస్తాడని తెలిపారు. కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో.. ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యాన్ని చూపిస్తాడని చిరంజీవి అన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడని ప్రశంసించారు. పవన్ కల్యాణ్ తీరు తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని చిరంజీవి పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పవన్ కల్యాణ్.. తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు.
తన తమ్ముడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ప్రత్యేక రాజకీయ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..@PawanKalyan
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2026
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో… pic.twitter.com/FEFdNToZ9a








నెగ్గిన రేవంత్ పంతం.. మంత్రి కొండా సురేఖపై వేటు