నల్లగొండలో(Nalgonda) కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) కార్యకర్తల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు(Eggs), టమాటాలతో (Tomatoes) దాడి చేసి, కార్యాలయాన్ని తగలబెట్టేందుకు యత్నించారు. మంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు అక్కడ ఉన్న ఫ్లెక్సీని సైతం తగలబెట్టేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి (Nagam Varshit Reddy) ప్రయత్నించారు.
దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫ్లెక్సీలు (Flexes) చించివేసిన కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు విసురుకోవడంతో బీజేపీ కార్యాలయం వద్ద రణరంగ పరిస్థితి నెలకొంది.
మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్ (Furniture పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తమ పార్టీ కార్యాలయం జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీజేపీ హెచ్చరించగా.. బీజేపీ కార్యాలయం వద్ద తాము కూడా నిరసనకు దిగుతామని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రకటించారు. దీంతో నల్లగొండలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నల్లగొండలో కాంగ్రెస్ – బీజేపీ ఫైటింగ్
— Telugu Feed (@Telugufeedsite) August 31, 2026
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
ఇంట్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం
మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ దాడికి ప్రతిగా వర్షిత్ రెడ్డి ఇంటిని అటాక్ చేసిన కాంగ్రెస్ https://t.co/lcxEouT7fZ pic.twitter.com/aGs1y0QqPo








