కొత్త ప్రేమ క‌థ‌.. కీరవాణి ఇంట్లో త్వరలో పెళ్లి బాజా!

కొత్త ప్రేమ క‌థ‌.. కీరవాణి ఇంట్లో త్వరలో పెళ్లి బాజా!

Summarize with AI

టాలీవుడ్‌లో మరో సెలెబ్రెటీ లవ్ స్టోరీ అఫీషియల్‌గా బయటకొచ్చింది. ‘బలగం'(Balagam) సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్(Kavya Kalyanram), ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి (M. M. Keeravani) కుమారుడు (Son) , సింగర్ (Singer) కాలభైరవతో(Kaala Bhairava) తన ప్రేమ(Love) విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న రూమర్స్‌కు ఈ జంట తాజాగా తెరదించింది. సోషల్ మీడియా వేదికగా కాలభైరవతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్, రొమాంటిక్ ఫోటోలను కావ్య కళ్యాణ్‌రామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) షేర్ చేశారు. ఆమె పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. కాలభైరవ కూడా ఇదే పోస్ట్‌ను షేర్ చేస్తూ తమ మనసులు కలిసిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కీరవాణి ఇంట త్వరలోనే మరో ఘనమైన వివాహ వేడుక (Wedding Ceremony) జరగనుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, ‘బలగం’తో హీరోయిన్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కావ్య కళ్యాణ్‌రామ్.. ఇప్పుడు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ చేయి అందుకోబోతుండటంతో ఈ జోడీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే వీరు తమ వివాహ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment