నేపాల్ వరదల్లో ఏపీ ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతు

నేపాల్ వరదల్లో ఏపీ ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతు

Summarize with AI

నేపాల్‌లో(Nepal) సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రకు (Kailash Mansarovar Yatra) వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) చెందిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబం (NRI Family) వరదల్లో గల్లంతైంది. మన్యం జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ సాహు(Santosh Kumar Sahu) కుటుంబం ఈ ప్రమాదంలో చిక్కుకుంది.

మన్యం జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ సాహు (Santosh Kumar Sahu) (47) సుమారు 20 ఏళ్లుగా లండన్‌లో ఉంటూ అక్క‌డే స్థిరపడ్డారు. మానస సరోవర్ యాత్రలో భాగంగా భార్య సురభి (Surabhi) (43), కుమార్తెలు స్పందన(Spandana) (18), సైనా(Saina) (13)తో కలిసి నేపాల్‌కు వెళ్లారు. యాత్రలో భాగంగా కుటుంబం వాహనంలో ప్రయాణిస్తుండగా.. వంతెనపైకి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీగా వరద ప్రవాహం వచ్చింది. వరద ఉధృతికి వాహనం కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సంతోష్ కుమార్ సాహు, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం.

వాహనం వరదలో చిక్కుకున్న విషయాన్ని నేపాల్ గైడ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి సంతోష్ కుటుంబం ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించడంతో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు సమాచారం. సంతోష్ కుటుంబం సురక్షితంగా బయటపడాలని బంధువులు ఆశిస్తున్నారు. గల్లంతైన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అధికారులు, సహాయక బృందాలు చర్యలు చేపట్టాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment