నెల‌నెలా రూ.1.50 ల‌క్ష‌లు ఇవ్వు.. లేదంటే లీవ్ పెట్టి వెళ్లిపో..

నెల‌నెలా రూ.1.50 ల‌క్ష‌లు ఇవ్వు.. లేదంటే లీవ్ పెట్టి వెళ్లిపో..

Summarize with AI

అనంతపురం అర్బన్‌(Anantapur Urban) టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) దగ్గుపాటి ప్రసాద్(Daggubati Prasad) వ్య‌వ‌హార శైలి.. వివాదాస్ప‌ద వైఖ‌రి మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే మ‌రో వివాదాస్ప‌ద ఘ‌ట‌న బ‌య‌ట‌కొచ్చింది. ప్రతి నెలా రూ.1.50 లక్షల లంచం ఇవ్వాలని, లేదంటే సెలవు పెట్టి వెళ్లిపోవాలని స‌బ్ రిజిస్ట‌ర్‌ను (Sub-Registrar) టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపుల‌కు గురిచేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సబ్‌ రిజిస్ట్రార్‌(Sub-Registrar) రమణారావు (Ramanarao) ఆడియో సంభాషణలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ రమణారావే ఈ విషయాన్ని మ‌రొక వ్య‌క్తికి వివ‌రించ‌డం, నెల‌కు ల‌క్ష‌న్న‌ర ఇవ్వాల‌ని ఒత్తిడి తెస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ వెల్ల‌డించ‌డం.. ఎమ్మెల్యే అవినీతిని (Corruption) బ‌య‌ట‌పెడుతోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యే జోక్యం, డబ్బుల డిమాండ్‌ వంటి అంశాలు ఈ ఆడియో ద్వారా తెరపైకి వచ్చాయి.

టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ (Daggubati Prasad) వ్య‌వ‌హార శైలి మొద‌టి నుంచి వివాదాస్ప‌దంగానే ఉన్నా.. పార్టీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వార్‌-2 సినిమా సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్ త‌ల్లిని (Jr NTR Mother) ఉద్దేశిస్తూ దగ్గుపాటి ప్రసాద్ అస‌భ్య‌క‌రంగా దూషించారు. ఇందుకు సంబంధించి ఆడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయినా, ఆయ‌న‌పై తెలుగుదేశం పార్టీ(TDP) అధిష్టానం చ‌ర్య‌లు తీసుకోకుండా, వివ‌ర‌ణ‌తో స‌రిపెట్టింది.

అనంతపురంలో ఎగ్జిబిషన్‌ నిర్వాహకులను ఎమ్మెల్యే ద‌గ్గుపాటి అనుచ‌రులు రూ.20 లక్షలు డిమాండ్‌ చేశారని, నిర్వాహ‌కులు ఎస్పీ ఆఫీస్ గేట్ తాకారు. అదే విధంగా వైన్‌షాప్‌లో వాటా కోసం దుకాణాన్ని తగలబెట్టిన సీసీ టీవీ ఫుటేజ్ బ‌య‌ట‌ప‌డింది. వాటా కోసం వైన్‌షాపున‌కు నిప్పు పెట్టింది టీడీపీ ఎమ్మెల్యే అనుచ‌రులేన‌ని య‌జమానులు ఆరోపించిన విష‌యం తెలిసిందే.

ఇటీవల దగ్గుపాటి ప్రసాద్‌ రెండేళ్లలోనే రూ.200 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించారంటూ సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి (Prabhakar Chowdary) తీవ్ర ఆరోపణలు చేశారు. భూ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బెదిరింపులకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ఆధారాలతో ఫిర్యాదులు చేశానని కూడా పేర్కొన్నారు.

తాజాగా సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవహారానికి సంబంధించిన ఆడియోలు వెలుగులోకి రావడంతో గతంలో వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చకు వచ్చాయి. వరుసగా ఆరోపణలు తెరపైకి వస్తున్నప్పటికీ టీడీపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు గట్టిగా స్పందన లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దగ్గుపాటి ప్రసాద్‌పై వరుసగా ఆరోపణలు వస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని సొంత పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది. దగ్గుపాటి ప్రసాద్‌ నారా లోకేశ్‌కు(Nara Lokesh) అత్యంత సన్నిహితుడనే కారణంగానే ఆయనపై చర్యలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం వెనకడుగు వేస్తోందన్న రాజకీయ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఒక ప్రజాప్రతినిధిపై వ‌రుస‌గా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం, పోలీసు శాఖ సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఆడియో వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment